Wednesday, October 7, 2015

ఓ మంచి నాయకుడు!


అది ఒక అందమైన పల్లెటూరు. ప్రజలందరూ కలసి మెలసి జీవిస్తున్నారు. వారి బాగోగులు చూడడానికి ఒక మంచి నాయకుడు ఉన్నాడు. ఆనందముగా వున్న వీరికి ఒక పెద్ద సమస్య వచ్చినది, అది ఏమిటంటే వర్షము ఒక ఏడాదిగా పడడము లేదు. పంటలు ఎండిపోయాయి. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే ఆహార సమస్య వస్తుందని గ్రహించాడు ఆ తెలివి గల నాయకుడు, అందరి దగ్గర నుంచి కొంత దాన్యమును సేకరించి దాచిపెట్టాడు. వర్షాభావము అలాగే కొన్ని సంవత్చరములు కొనసాగడముతో త్రీవ్రమైన కరువు ఏర్పడినది. తినడానికి తిండి కరువైనది. నాయకుడు తను సేకరించిన దాన్యమును అందరికి ఏ రోజుకారోజు సమానముగా పంచి పెట్టే వారు. అది సరిపోని కొందరు దాన్యమును దొంగలించుట మొదలుపెట్టారు. అప్పుడు నాయకుడు దొంగతనము చేసిన వాళ్ళకి వంద కొరడా దెబ్బల శిక్ష పడునని ప్రకటించారు. ఒకరోజు నాయకుడి తల్లి దొంగతనము చేస్తూ పట్టుపడింది. ఆమె చాలా వృద్దురాలు. ఎలా ఆమెను ఆ నాయకుడు శిక్షించగలడు? ఆ వంద కొరడా దెబ్బలని తను తట్టుకొని బ్రతకగలదా?


శిక్షని అమలపరచడానికి తన తల్లిని తీసుకురమ్మన్నాడు, ఆమెను వారు శిక్షను విదించే ఒక పెద్ద స్తంభానికి కట్టారు. నాయకుడు ఆమె దగ్గరుకు వచ్చి తన తల్లిని హత్తు కొని నిలబడ్డాడు. కొరడా శిక్షని అమలు చేయమని ఆదేశించాడు. వారు కొట్టిన ప్రతి కొరడా దెబ్బ ఆ నాయకుడి శరీరాన్ని తాకింది. ఆ విదముగా శిక్షని పూర్తి చేశాడు. తన తల్లికి పడవలసిన శిక్షను తనమీద వేసుకొన్నాడు. రక్తముతో తడచిన తన కొడుకుని చూసి ఆ తల్లి హృదయము ద్రవించింది. ఆ తల్లి ఇక ఎప్పటికైనా దొంగతనము చేయగలదా?

ఈ కథ లోని నాయకుడు వంటివాడే మన దైవ కుమారుడు! మనకు పడవలసిన శిక్ష్యను తను భరించాడు. మనకోసరము కొన్ని వందల కొరడా దెబ్బలను, ముళ్ళ కిరీటమును మరియు చీలలతోనూ, ఈటె తోను హింసించబడి మరణించాడు. అది తెలిసిన మనము ఇంకా ఎలా పత్యాత్తాప పడకుండా వుండగలము?


Origin: Based on Old Spanish Story

No comments:

Post a Comment